యుద్ధానికి సైర సిద్దం

యుద్ధానికి సైర సిద్దం
x
Highlights

యుద్ధానికి అంత ఇక సిద్దమట, సైర సినిమా చిత్రీకరణ జార్జియాలనట, 45కోట్లు రూపాయలు ఈ యుద్ధానికి ఖర్చట, ట్విట్టర్ ద్వార దర్శకుడి ముచ్చటట. శ్రీ.కో. ...

యుద్ధానికి అంత ఇక సిద్దమట,

సైర సినిమా చిత్రీకరణ జార్జియాలనట,

45కోట్లు రూపాయలు ఈ యుద్ధానికి ఖర్చట,

ట్విట్టర్ ద్వార దర్శకుడి ముచ్చటట. శ్రీ.కో.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి'. ఎంతో మంది అభిమానుల ఎదురు చూస్తున్నారు, గొప్ప బడ్జెట్‌తో నిర్మిస్తున్నఈ చిత్రానికి కిక్ ఫేం సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు జార్జియాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుందట, అక్కడ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారని సురేందర్ రెడ్డిగారు తన ట్విట్టర్ ద్వార తెలిపారు. దాదాపు 45కోట్లు ఖర్చు పెడుతున్న ఈ యుద్ధానికి అంతా సిద్ధమైందని సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను, ఫొటోలను షేర్ చేసుకున్నాడు దర్శకుడుసురేందర్ రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుండగా, ఇక మిగిలిన తారాగణం, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, రోహిణి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories