ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
x
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజపేట మండల శివారులోని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాగభూషణం...

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజపేట మండల శివారులోని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాగభూషణం అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. కోళ్లఫారానికి దగ్గర్లో ఉన్న ఇంట్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. మృతులు బాలనర్సయ్య, భారతమ్మ, వారి కూతురు తిరుమల, అల్లుడు బాలరాజు, పిల్లలు శ్రావణి, చింటూ, బన్నిలుగా గుర్తించారు. నాగభూషణం అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో కూలీలుగా పనిచేయడానికి కొద్ది రోజులు క్రితమే వచ్చారు. కూతురు, అల్లుడు, పిల్లల్ని చూసేందుకు రెండు రోజుల క్రితమే బాలనర్సయ్య, భారతమ్మ రాజపేటకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఏడుగురు ఎలా మృతి చెందారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories