ఓటుకు నోటు కేసు.. ఫిబ్రవరిలో విచారణ

ఓటుకు నోటు కేసు.. ఫిబ్రవరిలో విచారణ
x
Highlights

తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ త్వరితగతిన...

తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ త్వరితగతిన చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు... ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్‌ చేయాలని ఆదేశించింది. అయితే, ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు. 2015, మే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు లంచాలు ఇచ్చారని కోర్టుకు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టుకు తెలిపాడు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ మదన్ బీ లోకూర్.. ఈ కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి - మార్చిలో ఎన్నికలు ఉంటాయని సిద్ధార్థ్ తెలిపాడు. ఆ విషయంలో తామేమి చేయలేమన్న జస్టిస్ మదన్ బి లోకూర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories