అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో అద్భుత దృశ్యం

x
Highlights

ప్రత్యక్ష నారాయణుడి కిరణాలు సూర్యనారాయణుడి పాదాలను తాకాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ద అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం సూర్యుని లేలేత...

ప్రత్యక్ష నారాయణుడి కిరణాలు సూర్యనారాయణుడి పాదాలను తాకాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ద అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం సూర్యుని లేలేత కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి సుందర రూపాన్ని కళ్లారా చూసేందుకు పోటీ పడ్డారు.

ఏటా.. మార్చి, అక్టోబర్‌ నెలలో మూడు రోజుల పాటు.. ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. తొలిరోజున గర్భాలయంలోని స్వామివారి మూలవిరాట్టు పాదాలపై పాక్షికంగా కిరణాలు పడ్డాయి. ఉత్తరాయన, దక్షిణాయన కాలంలో వచ్చే మార్పుల్లో ఈ అద్భుతం సాక్షాత్కరింపబడుతుంది. కొద్ది క్షణాల పాటు కనిపించే ఈ సుందర దృశ్యాన్ని వీక్షించిన భక్తులు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories