విస్తృతంగా ప్రచారం చేస్తున్న సుహాసిని

nanireddy
Updated on: 24 Dec 2018 4:16 PM IST
విస్తృతంగా ప్రచారం చేస్తున్న సుహాసిని
X

టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని విమర్శించారు కూకట్‌ పల్లి నియోజవర్గం టీడీపీ అభ్యర్థి సుహాసిని. కూకట్‌పల్లిలోని వీధుల్లో సుహాసిని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ సుహాసినితో కలిసి ఏపీ మంత్రి పరిటాల సునీత కూడా ప్రచారం చేశారు. మరోవైపు ప్రజా కూటమి నేతలు కూకట్‌పల్లి లోకల్‌ మేనిఫెస్టో ప్రకటించారు. పెద్దిరెడ్డి, సర్వే, కాసాని జ్ఞానేశ్వర్, కూన శ్రీశైలంగౌడ్, విష్ణువర్థన్‌రెడ్డి అలాగే పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తదితరులు కలిసి లోకల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా సుహాసిని మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు. తాత, నాన్నగారి ఆశయాల కోసం పనిచేస్తామని ఆమె చెప్పారు.

nanireddy

nanireddy

Next Story