పొట్టుపొట్టు కొట్టింది పెళ్లి చేసుకుంది.!

x
Highlights

కర్నూలులో ఓ ప్రేమికురాలు గెలిచింది. మోసం చేద్దామని ప్లాన్ వేసిన ప్రియుడికి తగిన బుద్ధి చెప్పింది. అతనికి దేహశుద్ధి చేయడమే కాదు...ప్రియుడి బంధువులను...

కర్నూలులో ఓ ప్రేమికురాలు గెలిచింది. మోసం చేద్దామని ప్లాన్ వేసిన ప్రియుడికి తగిన బుద్ధి చెప్పింది. అతనికి దేహశుద్ధి చేయడమే కాదు...ప్రియుడి బంధువులను కూడా చితకబాదింది. చివరికి తన లవ్ స్టోరీకి మూడు ముళ్ళతో శుభం కార్డు వేసుకుంది. ఇది ఓ ప్రేమికురాలి ఆగ్రహం.. ప్రియుడి మోసానికి ఇలా అపర కాళికలా మారింది. ఈమె పేరు దివ్యబాయి. ఈమెది కర్నూలు జిల్లా పాణ్యం మండలం రాంభూపాల్ రెడ్డి తండా. నంద్యాల మండలం కానాలకు చెందిన చంద్ర శేఖర్ , దివ్య మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన చంద్రశేఖర్ ...అమెను లోబర్చుకున్నాడు. తీరా పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి తోకాడించాడు. పెద్దలు చూసిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని అయిపు లేకుండా పోయాడు. ప్రియుడు హ్యాండివ్వడానికి యత్నిస్తున్నాడని గ్రహించిన దివ్య ఆగ్రహంతో రగిలిపోయింది. చంద్ర శేఖర్ ఆచూకీ కనుక్కుని కుటుంబ సభ్యులతో అతని ఇంటికి వెళ్ళి ఇలా బుద్ధి చెప్పింది.

తర్వాత ప్రియుడి మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి అతణ్ణి అప్పచెప్పింది. నంద్యాల పోలీసుల జోక్యంతో దివ్య, చంద్రశేఖర్ స్థానిక ఆలయంలో పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత తమ లవ్ స్టోరీకి ఓ సె‌ల్ఫీతో క్లైమాక్స్‌ను ఎండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories