స్కూల్‌లో గోడ కూలి.. ఇద్దరు చిన్నారుల మృతి

స్కూల్‌లో గోడ కూలి.. ఇద్దరు చిన్నారుల మృతి
x
Highlights

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం నెలకొంది. న్యూ సెంచరీ స్కూల్‌లో కరాటే ట్రైనింగ్‌ నిర్వహిస్తుండగా స్టేజ్‌ కూలి ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు...

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం నెలకొంది. న్యూ సెంచరీ స్కూల్‌లో కరాటే ట్రైనింగ్‌ నిర్వహిస్తుండగా స్టేజ్‌ కూలి ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యార్థులకు కరాటే ట్రైనింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులంతా స్టేజీపై కరాటే నేర్చుకుంటుండగా ఒక్కసారిగా స్టేజ్‌ పైకప్పు కూలిపోయింది. కూలిన స్టేజ్‌ పైకప్పు విద్యార్థులపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories