logo
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లాలో విషాదం...ప్రత్యేక హోదాకోసం బాలుడు సూసైడ్

కర్నూలు జిల్లాలో విషాదం...ప్రత్యేక హోదాకోసం బాలుడు సూసైడ్
X
Highlights

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలదుర్గంలో మహేంద్ర అనే 15 సంవత్సరాల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు....

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలదుర్గంలో మహేంద్ర అనే 15 సంవత్సరాల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసమే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్‌ నోట్‌ రాశాడు. మహేంద్ర ఆత్మహత్య విషయం తెలియడంతో ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మహేంద్ర ఆత్మహత్య బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని హోదా కోసం జీవితాలను పణంగా పెడుతున్నా కేంద్రంలో కదలిక లేరావడం లేదన్నారు బాబు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరికాదని, పోరాటాలతోనే హోదా సాధిద్దామని చెప్పారు. మహేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story