మాయ‌మై పోతున్న‌డ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు

మాయ‌మై పోతున్న‌డ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు
x
Highlights

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరియ‌ర్ నాశ‌నం అయ్యింది. సౌతాఫ్రికా మ్యాచ్ లో బాల్ టాంప‌రింగ్ వివాదంలో చిక్కుకున్న స్మిత్ ఏడాది పాటు...

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరియ‌ర్ నాశ‌నం అయ్యింది. సౌతాఫ్రికా మ్యాచ్ లో బాల్ టాంప‌రింగ్ వివాదంలో చిక్కుకున్న స్మిత్ ఏడాది పాటు నిషేదానికి గుర‌య్యాడు.
కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో అస‌లు దోషులు ఎవ‌రో తెలుసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా బృందంలోని క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ లైన్‌ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ పాట్‌ హోవార్డ్‌లు కేప్ టౌన్ వేదిక గా విచార‌ణ చేప‌ట్టారు.
తొల‌త టాంపరింగ్ చేయాల‌ని దురుద్దేశం వ‌చ్చింది డేవిడ్ వార్న‌ర్ అని, వార్న‌ర్ టాంపరింగ్ ఎప్పుడు ఎలా చేయాలో ఓపెన‌ర్ బాన్ క్రాప్ట్ కు సూచ‌న‌లిచ్చాడ‌ట‌. ఆ తరువాత‌ తన పథకాన్ని స్మిత్‌కు చెప్పగా అతను కూడా గుడ్డిగా ఒప్పుకున్నాడని, కానీ ఆట‌గాళ్లంద‌రూ అంగీక‌రించ‌రు అని కెప్టెన్ స్మిత్ అన్నాడ‌ట‌. స్మిత్‌ ఆమోదంతో వార్నర్‌ సూత్రధారిగా.. బాన్‌క్రాఫ్ట్‌ పాత్రధారిగా టాంపరింగ్‌కు తెరలేచినట్టు తెలుస్తోంది. అనుకున్న ప‌థ‌కం ప్ర‌కారం కేప్ టౌన్ వేదిక‌గా మూడు టెస్ట్ లో డేవిడ్ వార్న‌ర్ చేతినిండా టేప్ చుట్టుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ను ఆ టేప్ సాయం తో బంతి ఆకారాన్ని మార్చాడు. ఇది గ‌మనించిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ అంపైర్ కు ఫిర్యాదు చేశారు. దీన్ని అంపైర్లు అంత‌గా ప‌ట్టించుకోలేదు.
ఎప్పుడైతే సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ అంపైర్ కు ఫిర్యాదు చేశారో..ఆ విష‌యం అంతా సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ ఛానెల్ లో రికార్డ్ అయ్యింది. అప్ప‌టి నుండి కంగారుల బౌలింగ్ పై దృష్టిసారించారు. బౌలర్ బాల్ విసిరినప్పటి నుంచీ తిరిగి అతని చేతికి వచ్చే వరకు కెమెరాల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు.
అదే స‌మ‌యంలో బౌల‌ర్ బెన‌క్రాప్ట్ త‌న ద‌గ్గ‌ర ఉన్న టేప్ తో బంతి ఆకారాన్ని మార్చుతుండ‌గా .. ఆ సన్నివేశాలను టీవీలో చూపించడంతో కోచ్‌ డారెన్‌ లెహమాన్‌ అప్రమత్తమై డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లతో వాకీటాకీలో వారితో మాట్లాడాడు.
నిజ‌నిర్ధార‌ణ కోసం కెమెరామెన్ సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ ఛానెల్‌ కెమెరామెన్ జోటని ఆస్కార్ తో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఇక, ఆసీస్ బౌలర్లు 30 ఓవర్లలోపే బంతిని రివర్స్ స్వింగ్ చేయడాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయిన ఆస్కార్ ఇదే విష‌యాన్ని సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ కు చెప్పాడు.
దక్షిణాఫ్రికాలో పచ్చిక ఉన్న పిచ్‌లపై బంతి ఆకారం అంత త్వరగా మారిపోవడం అసాధ్యమని, కానీ 30 ఓవర్లలోపే ఆసీస్ బౌలర్లు రివర్స్ స్వింగ్ చేయడంతో వాళ్లు కచ్చితంగా ఏదో చేస్తున్నారన్న అనుమానం కలిగిందని తెలిపాడు. గంటన్నరపాటు బంతి ఎవరెవరి చేతుల్లోకి వెళ్తున్నదో జాగ్రత్తగా గమనించాల‌ని సూచింది. అప్పుడే ఈ టాంప‌రింగ్ వివాదం వెలుగులోకి వ‌చ్చింది.
ఆ త‌రువాత టాంప‌రింగ్ పై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ఆట‌గాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంది. అయితే ఈ టాంప‌రింగ్ లో స్మిత్ ఉండ‌డంతో అత‌ని కెరియ‌ర్ బ్యాక్ టు పెవిలియన్ బాట పట్టింది. కొద్ది కాలం క్రితం స్మిత్ తన క్రికెట్ జీవిత చరిత్ర ఆధారంగా ” ది జర్నీ స్టీవ్ స్మిత్ ” అనే బుక్ ను విడుద‌ల చేయ‌డంతో .. కొన్నిగంట‌ల్లో ఆ బుక్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయింది.
కానీ ఇప్పుడు ప‌రిస్థితి త‌ల్ల‌కిందులైంది. బాల్ టాంప‌రింగ్ వివాదంలో స్మిత్ అడ్డంగా దొరికి పోవ‌డంతో దీన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ బుక్ షాప్ డిస్కౌంట్ అంటూ కేవలం 2 డాలర్లకే అమ్ముతామంటూ బోర్డు పెట్టింది. అంటే దాదాపు 90 శాతం తగ్గింపు అన్నమాట ! ఈ వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధర ఇంత తగ్గించినా.. ఒక్కరైనా ఈ పుస్తకం వైపు చూస్తే ఒట్టు !

Show Full Article
Print Article
Next Story
More Stories