ఆ కరుణిడీకే తెలియాలి

ఆ కరుణిడీకే తెలియాలి
x
Highlights

కరుణానిధి కాలం చెయ్యడం, పార్టీలో కుటుంబ గొడవలు పెరగడం, భగ్గు మంటున్నాయి పాలోల్ల పంచాయితీలు, అధికారం కోసమా, ఆస్తుల కోసమో ఆ కరుణిడీకే తెలియాలి. ...

కరుణానిధి కాలం చెయ్యడం,

పార్టీలో కుటుంబ గొడవలు పెరగడం,

భగ్గు మంటున్నాయి పాలోల్ల పంచాయితీలు,

అధికారం కోసమా, ఆస్తుల కోసమో ఆ కరుణిడీకే తెలియాలి.

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణంతో వారి పార్టీలో కుటుంబ గొడవలు భగ్గు మంటున్నాయి. పార్టీలో ఆధిపత్యం కోసం అన్న దమ్ములు అళగిరి, స్టాలిన్‌ తమ బలాబలాలు నిరూపించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో స్టాలిన్‌ వైపు చాల మంది వుండగా , గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కరుణ పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అయిన అళగిరి మళ్లీ పార్టీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అందుకు అన్ని ద్వారాలు మూసుకుపోవడంతో, మరో దారి కోసం అళగరి బలసమీకరణకు సిద్ధమవుతున్నారు. వచ్చే సెప్టెంబర్‌ 5వ తేదీన చెన్నైలో అళగిరి నాయకత్వంలో బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆ ర్యాలీకి దక్షిణాది జిల్లాల నుంచి కనీసం పదివేలమంది కార్యకర్తలను తరలించాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే తన అనుచరులతో రహస్య మంతనాలు జరుపుతూ, గురువారం ఉదయం మదురైలోని అళగిరి నివాస గృహంలో దక్షిణాది జిల్లాలకు చెందిన ఆయన మద్దతుదారులతో సమావేశమయ్యి వ్యూహ రచనలో వున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories