శ్రీకాంతాచారి తల్లి తీవ్ర మనోవేదన

x
Highlights

మలి దశ తెలంగాణ ఉద్యమంలో అసువు లు బాసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి.. ప్రత్యేక తెలంగాణ కావాలంటూ ఉస్మానియా యూనివర్శిటీలో వేలాది మంది చూస్తుండగా,...

మలి దశ తెలంగాణ ఉద్యమంలో అసువు లు బాసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి.. ప్రత్యేక తెలంగాణ కావాలంటూ ఉస్మానియా యూనివర్శిటీలో వేలాది మంది చూస్తుండగా, ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి...కానీ శ్రీకాంతాచారి ఆత్మత్యాగం నిరూపయోగమైపోయిందని ఆయన తల్లి శంకరమ్మ శనివారం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా తనను మొదట వేదిక మీదకు పిలువకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన జరిగింది.

తెలంగాణ రాష్ట్ర నాలుగోవ ఆవిర్భావ వేడుకల్లో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో తనను వేదికపైకి మొదట పిలువకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు శ్రీకాంతాచారి త్యాగాన్ని మరిచిపోయి.. తన కొడుకును అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జోక్యం చేసుకుని.. ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వేదికపై తనను సన్మానించిన వెంటనే.. ఆవేదనతో అక్కడి నుంచి శంకరమ్మ వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories