క్రికెటర్‌ తలకు బలంగా తాకిన బంతి..

nanireddy
Updated on: 24 Dec 2018 3:45 PM IST
క్రికెటర్‌ తలకు బలంగా తాకిన బంతి..
X

లంక బోర్డ్‌ లెవన్‌తో ఇంగ్లండ్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుండగా శ్రీలంక క్రికెటర్‌ పాతుమ్‌ నిస్సాంకా తలకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కొట్టిన ఓ బలమైన షాట్‌.. లెగ్ సైడ్ ఫీల్డింగ్‌ చేస్తున్న నిస్సాంకా తలకు గట్టిగా తాకింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే సహచరులు అతనికి సపర్యలు చేశారు. అనంతరం స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు స్టేడియం సిబ్బంది. ప్రస్తుతం నిస్సాంకా ఆరోగ్యం నిలకడగా ఉంది.

సకాలంలో అతనికి వైద్యం అందడంతో ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలియజేశారు. కాగా, నిస్సాన్‌ హెల్మెట్‌కు తగిలిన బంతి కాస్తా లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఏంజెలో మాథ్యూస్‌ చేతిలో పడింది. దాంతో బట్లర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. ఇదిలావుంటే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా గా ముగిసింది.

nanireddy

nanireddy

Next Story