ప్రత్యేక హోదా ఉద్యమం మరో మలుపు తిరగబోతోందా..?

ప్రత్యేక హోదా ఉద్యమం మరో మలుపు తిరగబోతోందా..?
x
Highlights

ప్రత్యేక హోదా ఉద్యమం మరో మలుపు తిరగబోతోందా..? ఉద్యోగ సంఘాలు కూడా పోరుబాట పట్టనున్నాయా..? APNGO నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరగబోదోందా..?...

ప్రత్యేక హోదా ఉద్యమం మరో మలుపు తిరగబోతోందా..? ఉద్యోగ సంఘాలు కూడా పోరుబాట పట్టనున్నాయా..? APNGO నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరగబోదోందా..? సమైక్య హోదా సమయంలో ఏర్రడిన జేఏసీ మరోసారి ప్రత్యేక హోదా కోసం తెరైకి రానుందా..?

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీ ఎన్జీవోలు ధర్నాలు చేపట్టారు. 13 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర నిరసనకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ దగ్గర కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేయని ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలను, అన్ని సంఘాలను ఒకే తాటిపైకి తెచ్చి పోరాటం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. సమైక్య ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన జేఏసీని త్వరలో సమావేశ పరచి కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు.

నిజానికి ఆవోక్ ఏపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని గత శనివారం హెచ్ ఎంటీవీ నిర్వహించిన దశదిశా కార్యక్రమం వేదికగా అశోక్ బాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమ జీతాలు చిన్న విషయంటూ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories