నల్గొండ ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతుల్లో...ఒక్కొక్కరికి ఒక్కో విషాదగాథ

నల్గొండ ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతుల్లో...ఒక్కొక్కరికి ఒక్కో విషాదగాథ
x
Highlights

ట్రాక్టర్‌ ప్రమాదంలో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఒకరు కుటుంబానికి ఆసరాగా కూలీకి వెళ్తే...మరొకరు డిగ్రీ ఫీజు డబ్బు కోసం కూలీ వెళ్లారు. భవిష్యత్‌ను...

ట్రాక్టర్‌ ప్రమాదంలో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఒకరు కుటుంబానికి ఆసరాగా కూలీకి వెళ్తే...మరొకరు డిగ్రీ ఫీజు డబ్బు కోసం కూలీ వెళ్లారు. భవిష్యత్‌ను అద్భుతంగా తీర్చి దిద్దుకునేందుకు వెళ్తే...ట్రాక్టర్‌ రూపంలో వారిని మృత్యువు కబలించింది. ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమా ? మరోవైపు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిహారం పెంచాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు.

వేములకొండ ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్థులు నిరసనకు దిగారు. పరిహారాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బాధితుల బంధువులు...ప్రస్తుతం ఇచ్చిన పరిహారం సరిపోదని...దీన్ని పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో....పోలీసులకు, బాధితుల బంధువులకు తోపులాట జరిగింది.

యాదాద్రి జిల్లాలో జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో విషాదగాథలెన్నో ఉన్నాయ్. వేములకొండ చెరువు పక్కన పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు మహిళా కూలీలు ట్రాక్టర్‌లో బయల్దేరారు. ప్రమాద సమయంలో 30 మందికి పైగా కూలీలు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉండాలన్న లక్ష‌్యంతో...తల్లితో పాటు కూతురు కూడా కూలీ పనులకు బయలుదేరింది. అంతలోనే ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు వెంటాడింది.

డిగ్రీలో చేరేందుకు కావాల్సిన డబ్బు కోసం కూలి పనికి వెళ్లి...మరో అమ్మాయి చనిపోయింది. కూతురి మృతిపై కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ట్రాక్టర్‌ ప్రమాదం తమ జీవితం చిమ్మ చీకట్లు నింపిందంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయ్. మరోవైపు ట్రాక్టర్‌ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇరుకైన చెరువు కట్ట మీద పరిమితికి మించి వేగంగా వెళ్లడంతోనే ట్రాక్టర్‌ అదుపు తప్పి...మూసిలోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories