జగన్‌పై దాడి కేసులో కొత్త కోణాలు...ఇప్పటి వరకు 321 మంది...

జగన్‌పై దాడి కేసులో కొత్త కోణాలు...ఇప్పటి వరకు 321 మంది...
x
Highlights

జగన్ పై దాడి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ కాల్ డేటా సమాచారం దర్యాప్తులో కీలకంగా మారింది. ఘటన జరగడానికి కొద్ది నిమిషాల...

జగన్ పై దాడి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ కాల్ డేటా సమాచారం దర్యాప్తులో కీలకంగా మారింది. ఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఓ మహిళతో శ్రీనివాస్ జరిపిన సంభాషణ..ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదిశగా పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే నిందితుడు శ్రీనివాస్‌ దర్యాప్తునకు సహకరించడంలేదని పోలీసులు చెబుతున్నారు.

జగన్ పై దాడి కేసులో సిట్ కీలక సమాచారం సేకరించింది. దాడి ఘటనకు ముందు నిందితుడు శ్రీనివాస్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ఘటనకు కొన్నిగంటల ముందు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన యువతి సైరాబీతో శ్రీనివాస్‌ మాట్లాడినట్టు నిర్థారించారు. పది నిమిషాల్లో జగన్ ను తాను చంపేస్తానని..టీవీలో చూడాలంటూ ఆమెకు శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పినట్టు సిట్ విచారణలో తేలింది. దీంతో శ్రీనివాస్‌ ఫోన్‌లో మాట్లాడిన యువతితో పాటు అమె సోదరుడిని కనిగిరి నుంచి విశాఖ తీసుకొచ్చి విచారిస్తున్నారు.

మరోవైపు రమాదేవి అనే మహిళ ద్వారా శ్రీనివాస్ ఖాతాలోనికి నగదు బదాలయింపు జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఈ మహిళలకు శ్రీనివాస్ కు వున్న సంబందాలు ఏమిటనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 321 మందిని ప్రశ్నించిన పోలీసులు శ్రీనివాస్ తల్లిదండ్రులను కూడా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. నిందితుడు శ్రీనివాస్ స్వగ్రామం ఠానేలంకలోనూ విచారణ చేస్తున్న సిట్ అధికారులు తల్లిదండ్రులను కూడా ప్రాథమికంగా విచారించారు. తమ కుమారుడి ఆరోగ్యం గురించి వారు ఆందోళన వ్యక్తంచేయడంతో పాటు శ్రీనివాస్‌ను చూపించాలని సిట్‌ను కోరడంతో వారిని విశాఖ తీసుకెళ్లారు.

నిందితుడు శ్రీనివాస్‌ దర్యాప్తునకు సహకరించడంలేదని చెబుతున్న పోలీసులు, కస్టడీ పొడిగింపు కోసం కోర్టును కోరాలని భావిస్తున్నారు. శ్రీనివాస్ పోలీస్ కస్టడీ నవంబర్ రెండో తేదీన ముగుస్తుంది. అందుకే మరికొంత సమయం అడుగుతామని చెబుతున్నారు. శ్రీనివాస్‌‌తో పాటు అనుమానితులు చెప్పిన విషయాలను వాస్తవాలను పోల్చిచూస్తామని ఏసీపీ అర్జున్‌రావు తెలిపారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సిట్‌ కార్యాలయంలో నిన్న అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ బీపీ, పల్స్‌రేటు బాగానే ఉన్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories