జాక్‌పాట్‌ కొట్టిన స్వీపర్‌ రమణమ్మ...ఊహకే అందని జీతం ఆమె సొంతం

జాక్‌పాట్‌ కొట్టిన స్వీపర్‌ రమణమ్మ...ఊహకే అందని జీతం ఆమె సొంతం
x
Highlights

అదృష్టం తలుపుతట్టిందో లేక బాధ్యతలపై ఆమెకున్న అంకితభావం కలిసొచ్చిందో మొత్తానికి ఓ ప్రభుత్వరంగ సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్న రమణమ్మ జాక్‌పాట్‌...

అదృష్టం తలుపుతట్టిందో లేక బాధ్యతలపై ఆమెకున్న అంకితభావం కలిసొచ్చిందో మొత్తానికి ఓ ప్రభుత్వరంగ సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్న రమణమ్మ జాక్‌పాట్‌ కొట్టేసింది. బడా ప్రైవేటు కంపెనీల్లో తలబాదుకుంటూ కిందామీదా పడ్డా రాని జీతం రమణమ్మ మాత్రం.. నెలకాగానే ఠంచనుగా అందుకుంటుంది. అసలు రమణమ్మ ఎవరు..? ఆమె జీతం ఎంత..?

ఈమె పేరు కోల వెంకట రమణమ్మ. ఈమే నెలవారీ సంపాదన ఎంతో తెలుసా అక్షరాలా లక్షా 47 వేల 722 రూపాయలు. ఈ రోజుల్లో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కూడా అందుకోని ఇంతమొత్తం జీతాన్ని తీసుకుంటున్న ఈమే చేసే పని ఏంటో తెలుసా స్వీపర్‌ కమ్‌ గార్డియన్‌‌.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితోటకు చెందిన వెంకటరమణమ్మ 1978 లో తన 16 వ యేట ట్రాన్స్‌ కో జిల్లా కార్యాలయంలో స్వీపర్‌గా చేరారు. 1981 లో ఆమె ఉద్యోగం పర్మినెంట్‌ కాగా అప్పటి నుంచి అంకితభావంతో పనిచేస్తోంది. ఆమె సర్వీసు కూడా ఈ మధ్యే 40 యేళ్లు దాటింది. దీంతో సుదీర్ఘకాలం సర్వీసు ఉండటంతో ఈమే జీతం పెరుగుతూ వస్తోంది.

విద్యుత్‌ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలే ఇలా సాలరీలు పెరగడానికి కారణమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అత్యవసర సేవల్లోకి, 24 గంటల విధుల పరిధిలోకి ట్రాన్స్‌కోను తీసుకురావడంతో సర్వీస్‌ ఎక్కువ ఉన్న ఉద్యోగులకు సాలరీ అమాంతం పెరిగిందని అందులో భాగంగా రమణమ్మకు ఇంత పెద్ద మొత్తంలో జీతం అందుతుందని ట్రాన్స్‌ ఎస్‌ ఈ సత్యనారాయణ రెడ్డి చెబుతున్నారు.

భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నా ఆఫీస్‌లో రమణమ్మ సాధారణంగానే ఉంటుంది. ఆమె అంటే అధికారులకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందరితో కలగోలుపుగా ఉంటూ పనిచేయడం ఆమె ప్రత్యేకత. ఇలా లక్షన్నర వరకు సాలరీ అందుకునే స్వీపర్లు ఇదే కార్యాలయంలో మొత్తం నలుగురున్నారని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories