ఆపరేషన్ ముస్కాన్‌లో మరో షాకింగ్ న్యూస్...యాదాద్రి వ్యభిచార వ్యవహారంలో బయటపడ్డ బంకర్లు

x
Highlights

రాచకొండ పోలీసులు తీగలాగితే డొంక కదులుతోంది. చిన్న చేపలనుకొని వల వేస్తే పెద్దపెద్ద తిమింగళాలే బయటకొస్తున్నాయి. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద క్రైమ్ వెలుగులోకి...

రాచకొండ పోలీసులు తీగలాగితే డొంక కదులుతోంది. చిన్న చేపలనుకొని వల వేస్తే పెద్దపెద్ద తిమింగళాలే బయటకొస్తున్నాయి. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద క్రైమ్ వెలుగులోకి వచ్చింది. అలా పోలీసులకు అనుమానం రాకుండా వ్యభిచార గృహ నిర్వాహకులు పక్కాగా ప్లాన్ చేశారు ఎవ్వరూ కనిపెట్టకుండా కంత్రీగా ఆలోచించారు. కానీ రాచకొండ పోలీసుల సీరియస్‌నెస్ ముందు వారి ప్లాన్లు తేలిపోయాయ్. ఆలోచనలు ఆవిరైపోయాయి. బాలికలు, విటులను దాచేందుకు ఏర్పాటు చేసిన గుహలు ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. యాదాద్రి వ్యభిచార గృహాల్లో బయటపడిన బంకర్లపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.

ఆపరేషన్ ముస్కాన్‌లో రోజుకో షాకింగ్ న్యూస్ బయటకొస్తోంది. మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడమే కాదు వారిని దాచేందుకు ఏర్పాటు చేసిన నేలమాళిగలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయ్. పోలీసులకు దొరకకుండా వ్యభిచార గృహాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఈ గుహలు చూస్తుంటే వారి ఆలోచనలు ఎంత కంత్రీగా ఉన్నాయో అర్థమవుతోంది. అసలేంటీ ఈ నేలమాళిగల సంగతి..? ఎలా బయటపడ్డాయ్..?

మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారం వ్యవహారంలో మరిన్ని విస్తుగొలిపే నిజాలు బయటికొచ్చాయ్. వ్యభిచార గృహాల్లో బాలికలను దాచేందుకు ఏర్పాటైన నేలమాళిగలు తాజాగా వెలుగు చూశాయి. యాదాద్రి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాచకొండ పోలీసులు ప్రతి విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా యాదగిరిగుట్ట టౌన్‌లో మరోసారి వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విటులు, బాలికలను దాచేందుకు వారి నివాసాల్లో నేలమాళిగలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి పోలీసులు షాకయ్యారు.

బ్రోతల్ హౌస్‌పై ఎప్పుడైనా పోలీసులు సడన్‌గా రైడ్ చేస్తే బాలికలు, విటులు దొరకకుండా ఈ గుహలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. చూడటానికి ఇదొక షెల్ప్‌లా కనిపించినా దీనికింద పెద్ద సీనే ఉంది. పోలీసులు దాడులు చేసినప్పుడు వెంటనే వాటికిందకు దూరిపోయి నిలబడే అవకాశం ఉంటుంది. అప్పుడు వారు ఎవరికీ కనిపించరు. అలా చాలాసార్లు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. కానీ ఈసారి అలా జరగలేదు. సీన్ రివర్సైంది. రాచకొండ పోలీసులు చురుగ్గా వ్యవహరించిన వీటిని కనుక్కున్నారు. ఇలాంటి నేలమాళిగలు ఐదు ఇళ్లల్లో గుర్తించారు పోలీసులు. తాజా దాడుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నలుగురు బాలికలకు విముక్తి కల్పించారు.

మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా వారిని వ్యభిచార వృత్తిలోకి దించుతున్న యాదాద్రి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. బాలికలను త్వరగా వ్యభిచారం రొంపిలోకి దించేందుకు వీలుగా వారికి హార్మోన్‌ గ్రోత్‌ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాదగిరిగుట్టలో అనురాధ నర్సింగ్‌ హోం నడుపుతున్న ఆర్‌ఎంపీ నర్సింహ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు ఆసుపత్రిలో సోదాలు నిర్వహించి 43 ఇంజక్షన్లు గుర్తించారు. వెంటనే ఆర్ఎంపీ నర్సింహను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వ్యభిచారాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఎవరైనా వ్యభిచార గృహాలు నడుపుతున్నట్లు సమాచారం వస్తే వారిపై పీడీ యాక్ట్‌ను నమోదు చేస్తామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories