ఫ్యామిలీ పాలిటిక్స్...ఎవరి వంశవక్షం ఏంటి...ఎవరి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

x
Highlights

తెలంగాణ గడ్డపై వారసత్వ పాలన అంశం దుమారం రేపుతోంది. టిఆరెస్ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు.. కుటుంబ పాలనపై రెండు రోజులుగా ఒకరినొకరు ఏకి పారేసుకుంటున్నారు....

తెలంగాణ గడ్డపై వారసత్వ పాలన అంశం దుమారం రేపుతోంది. టిఆరెస్ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు.. కుటుంబ పాలనపై రెండు రోజులుగా ఒకరినొకరు ఏకి పారేసుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో నెహ్రూ కుటుంబానిది కీలక పాత్ర అయితే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబానిది కీలక పాత్ర ఎవరి వంశవక్షం ఏంటి?ఎవరి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

కుటుంబ పాలనపై పార్టీల మధ్య విమర్శనాస్త్రాలు పెరిగిపోతున్నాయి వంశాకురాలను, వారసులను బరిలోకి దించడంలో ఏ పార్టీ తీసిపోలేదు కానీ రాజకీయంగా విమర్శలొచ్చే సరికి మాత్రం ఎదుటి వారినే విమర్శిస్తుండటం విచిత్రం రాహుల్ శేరి లింగంపల్లి బహిరంగ సభలో టిఆరెస్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ అవినీతిమయమైపోయిందని, కేసిఆర్ కుటుంబ పాలన నడుస్తోందనీ దుమ్మెత్తిపోశారు. తమది కుటుంబ పాలన అన్న కామెంట్లపై కేసిఆర్ మండి పడ్డారు కుటుంబ పాలన గురించి మీరు మాకు చెబుతారా? కుటుంబ పాలన ఎవరిదో చిన్న పిల్లాడినడిగినా చెబుతారన్నారు రాహుల్, వర్సెస్, కేసిఆర్ మధ్య సాగిన ఈ ఆరోపణల నేపధ్యంలో ఎవరి ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంది? ఎవరి వంశ వృక్షం ఏంటి .

దేశాన్ని సుదీర్ఘ కాలం పాటూ ఏలిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు, వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. దేశానికి నేతృత్వం వహించిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరాగాంధీ తండ్రి వారసురాలిగా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీని, దేశాన్ని తనదైన శైలిలో అజేయంగా నడిపించిన ఉక్కు మహిళగా పేరు పడిన ఇందిర తన బిడ్డలను రాజకీయాల్లోకి ప్రోత్సహించారు. చిన్న కొడుకు సంజయ్ పార్టీలో ఆమె వెన్నంటే తిరిగేవారు అప్పట్లో సంజయ్ పై రాజ్యాంగేతరశక్తి అనే ఆరోపణ కూడా వచ్చింది. సంజయ్ హఠాన్మరణంతో ఇందిర రాజకీయాల్లో ఒంటరి వారైపోయారు. దాంతో తనకు ఆసరా కోసం రాజీవ్ గాంధీని ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. పైలట్ గా ఉన్న రాజీవ్ తల్లి కోరిక మేరకు కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. ఇందిర మరణానంతరం సానుభూతి పవనాలతో రాజీవ్ భారీ మెజారిటీతో గెలిచి ప్రధాని అయ్యారు. అనంతరం బోఫోర్స్ స్కామ్ వెలుగు చూడటం కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమయింది. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్ ను ఎల్టిటిఇ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోడంతో కాంగ్రెస్ మరోసారి దిక్కులేనిది అయ్యింది.

ఆ సమయంలో పి.వి. నర సింహారావు ప్రధాని అయ్యారు. దేశాన్నేలిన కాంగ్రెస్ ప్రధానుల్లో ఒక్క పి.విని మినహాయిస్తే మిగిలిన వారంతా నెహ్రూ వారసులే కాంగ్రెస్ కు అప్పటికే దేశ రాజకీయాల్లో తిరోగమనం ప్రారంభమవడంతో కాంగ్రెస్ నేతలు, నెహ్రూ, ఇందిర వీర విధేయులు సోనియా గాంధీని రాజకీయాల్లోకి రమ్మని కోరారు. దాంతో సోనియా పగ్గాలు చేపట్టారు. సోనియా రాకతో తగ్గి పోయిన కాంగ్రెస్ ప్రాభవం మళ్లీ పెరిగింది. యూపీఏ రెండు సార్లు అధికారం చేపట్టింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ మళ్లీ ప్రతిపక్షంలో కూర్చుంది. మన్మోహన్ ప్రధానిగా ఉన్నసమయంలోనే రాహుల్ ను ప్రధానిని చేయాలని, కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చినా.. రాహుల్ సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రతిపాదన పెండింగ్ లో పడింది. కాంగ్రెస్ కు అప్పటి వరకూ సోనియా నేతృత్వం వహించినా, ఆమె అనారోగ్యం కారణంగా రాహుల్ ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ సోదరి ప్రియాంక కూడా ఎన్నికల ప్రచార సభల్లో కనిపిస్తూ తన వంతు పార్టీకి సేవ చేస్తుంటారు. ఇక ఇందిర చిన్న కోడలు, సోనియా తోటి కోడలు అయిన మేనకాగాంధీ భర్త సంజయ్ మరణానంతరం సంజయ్ వికాస్ మంచ్ పేరుతో పార్టీ పెట్టారు. ఆపై దానిని బీజేపీలో విలీనం చేసి మంత్రి పదవులు పొందారు. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కూడా బిజెపిలో ఎంపీగా ఉన్నారు. ఇక కేసిఆర్ కుటుంబం విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నాటికే కేసిఆర్ టిడిపిలో ఉన్నారు తెలంగాణ సాధన కోసం పోరు మొదలు పెట్టాక కుటుంబం మొత్తం ఉద్యమాల్లో పాల్గొంది. కుమారుడు కేటిఆర్, కుమార్తె కవిత చాలా ఉద్యమాలకు నేతత్వం వహించారు ఇక మేనల్లుడు హరీష్ రావు ఉద్యమానికన్నా ముందునుంచే కేసిఆర్ వెంట ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్రం కోసం పోరాడిన కుటుంబం రాష్ట్ర సాధన అనంతరం పదవులు తీసుకుంది. కేసిఆర్ సిఎం కాగా, ఆయన కుమారుడు కేటిఆర్ ఐటి మంత్రిగా, మేనల్లుడు హరీష్ రావు భారీ నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్నారు. ఇక కుమార్తె కవిత గతంలో తెలంగాణ జాగృతి సంస్థ కార్యకలాపాలు చూసేవారు. ఆమె ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక కేసిఆర్ భార్య శోభ చెల్లెలి కొడుకు సంతోష్ కూడా టిఆరెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories