లాలూ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ..కాసేపట్లో తేలనున్న లాలూ భవితవ్యం

లాలూ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ..కాసేపట్లో తేలనున్న లాలూ భవితవ్యం
x
Highlights

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ భవితవ్యం కాపేపట్లో తేలనుంది. దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. విచారణకు...

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ భవితవ్యం కాపేపట్లో తేలనుంది. దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. విచారణకు హాజరయ్యేందుకు లాలూ తన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి ఇప్పటికే రాంచీకి చేరుకున్నారు. దాణా కేసులో మాజీ సీఎంలు లాలూ ప్రసాద్, జగన్నాథ్‌ మిశ్రా సహా 22 మందిపై ఛార్జిషీట్ దాఖలైంది. 1991–94 కాలంలో ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉన్న దియోగఢ్ ట్రెజరీ నుంచి పశువుల దాణా పేరుతో 89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ సహా 38 మందిపై కేసులు నమోదయ్యాయి. 1997, అక్టోబర్‌ 27న సీబీఐ చార్జిషీట్‌ దాఖలుచేసింది. విచారణ కొనసాుతుండగానే11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో రాబోయే తీర్పు లాలూ రాజకీయ భవిష్యత్తుకు కీలకం కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories