కొండగట్టు చెట్టు గుట్టు

కొండగట్టు చెట్టు గుట్టు
x
Highlights

కొండగట్టు వద్ద చెట్టు, మాట్లాడెనట వరుసపెట్టి, ఖాకి వచ్చి చెవి పెట్టునే, మూగబోయినట బెట్టు పట్టి. అంతా ఆ తాటి మహిమ. శ్రీ.కో కొండగట్టు ప్రాంతంలో ఒక...

కొండగట్టు వద్ద చెట్టు,

మాట్లాడెనట వరుసపెట్టి,

ఖాకి వచ్చి చెవి పెట్టునే,

మూగబోయినట బెట్టు పట్టి.

అంతా ఆ తాటి మహిమ. శ్రీ.కో

కొండగట్టు ప్రాంతంలో ఒక తాటిచెట్టు నుండి మాటలు వినిపిస్తున్నాయన్న వార్త జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. సదరు మాట్లాడే చెట్టు పోలీసులు తన వద్దకు రాగానే మౌనవ్రతం పట్టేసింది. దీంతో వదంతులకు తెరపడింది. ‘మేం గురువారం సాయంత్రం ఆ చెట్టు వద్దకు వెళ్లాం. దగ్గరగా చెవి పెట్టి మరీ విన్నాం. మాకు ఎలాంటి శబ్దమూ వినిపించలేదు. చుట్టుపక్కల ఉన్న చెట్లపై కొన్ని తేనెపట్లు ఉన్నాయి. తేనెటీగల శబ్దాన్ని జనం తాటిచెట్టు మాటలుగా అపోహపడ్డారు.. ’ అని మల్లియాల్ సీఐ నాగేందర్ చెప్పారు. జనం ఇలాంటి పుకార్లను పట్టించుకోవద్దని, బుర్రపెట్టి ఆలోచించాలని హితవు పలికారు. దీంతో మూడు రోజులుగా పూజలందుకున్న తాటిచెట్టమ్మ ఇప్పుడు బోసిపోయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories