హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపిన స్పీకర్‌కు జరిమానా విధించండి

హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపిన స్పీకర్‌కు జరిమానా విధించండి
x
Highlights

సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో బస్టాండు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి బైక్ ర్యాలీ నిర్వహించారు. గత వారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ...

సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో బస్టాండు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి బైక్ ర్యాలీ నిర్వహించారు. గత వారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా స్పీకర్ బైక్ నడిపారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపినందుకు శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారిపై డీజీపీ మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ నేత ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. భూపాలపల్లిలో బస్టాండు ప్రారంభోత్సవం సందర్భంగా గతవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మధుసూదనాచారితోపాటు వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్పీకర్‌, పోలీసులకు సాధారణ ప్రజల మాదిరిగా రూ.100 నుంచి రూ.500 వరకు జరిమానా విధించాలని కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ మంగళవారం ట్విటర్‌లో డీజీపీకి ఫిర్యాదు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories