తల్లిని రోడ్డుపై వదిలేశాడు..కనిపించడం లేదని కేసు పెట్టాడు..

x
Highlights

ముగ్గురు కొడుకులున్నారు. ఒక కూతురుంది. అయినా ఆ వృద్ధురాలు రోడ్డున పడింది. కొడుకే తల్లిని రోడ్డపై వదిలేసి.. కనిపించడం లేదని పోలీసు కేసు కూడా పెట్టాడు....

ముగ్గురు కొడుకులున్నారు. ఒక కూతురుంది. అయినా ఆ వృద్ధురాలు రోడ్డున పడింది. కొడుకే తల్లిని రోడ్డపై వదిలేసి.. కనిపించడం లేదని పోలీసు కేసు కూడా పెట్టాడు. కానీ సంఘం చూస్తూ ఊరుకోదు కదా? కొంతమంది సహృదయులు ముందుకొచ్చారు. సహృదయ్‌ ఆశ్రమానికి తరలించారు.

వరంగల్‌ ఎమ్‌జీఎమ్‌ ఆవరణ. ఇక్కడ నేలపై కూచున్న అవ్వ పేరు సత్యవతి. ఈమెకి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. పెద్ద కొడుక్కి మతి స్థిమితం లేదు. మిగిలిన ఇద్దరు కొడుకులు నెలవారీ వంతులు చొప్పున పంచుకుంటుంటారు. చిన్న కొడుకు నెల అయిపోవడంతో తల్లిని ఇలా రోడ్డుపై వదిలేసి తప్పి పోయిందని మిస్సింగ్‌ కేసు కూడా పెట్టాడు. కొడుకులు, కూతుళ్లు ఉన్నా.. ఈ అవ్వ అనాథలా రోడ్డుపై ఉండి పోయింది. ఇది కొంతమంది యువకులు గమనించి ఫేస్‌ బుక్‌లో లైవ్‌ పెట్టారు. షేర్‌ చేశారు. ఈ విషయం వరంగల్‌ సహృదయ్‌ నిర్వాహకురాలు యాకుబికి కూడా తెలిసింది. సత్యవతి ఉన్న చోటుకి.. సహృదయ్‌ వాహనంతో వచ్చింది. సరిగ్గా అదే సమయంలో సత్యవతి కుమార్తెకి కూడా విషయం తెలిసి ఉరుకు పరుగులతో చేరుకుంది. ఇక్కడ అవ్వ సత్యవతిని పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నకుమార్తె.. తల్లి పరిస్థితి చూసి గుండెలవిసేలా ఏడవడం మినహా ఏమీ చేయలేకపోయింది. కుమార్తె బరువెక్కిన గుండెతో తల్లికి ఇలా వీడ్కోలు చెప్పింది.

సత్యవతి ఇష్టప్రకారం ఆశ్రమానికి తరలిద్దామని పోలీసులు ప్రయత్నించారు. తనను పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళతారేమో... తన కొడుకులపై కేసులు పెడతారేమోనని సత్యవతి తటపటాయించింది. రోడ్డుపై వదిలేసినా.. కొడుకులకు ఏమీ కాకుడదనే కోరుకుంది. వరంగల్‌ అర్బన్‌ కాశి బుగ్గలో నివాసముంటున్న సత్యవతి కొడుకులు, .. సహృదయ్‌ వాహనమెక్కి ఆశ్రమానికి వెళుతోంది. రెండో కోడలు బరువెక్కిన గుండెతో అత్తకి ఇలా వీడ్కోలు చెప్పింది. సత్యవతిని ప్రస్తుతానికి సహృదయ్‌ ఆశ్రమానికి తీసుకెళుతున్నామని, పద్దతిగా చూసుకుంటే.. కొడుకులకు అప్పచెబుతామని నిర్వాహకురాలు యాకూబి చెబుతున్నారు. అమ్మల్ని చూసుకోలేకపోతే.. తమకు అప్ప చెప్పమని.. ఇలా దిక్కు లేని వాళ్లలాగా రోడ్లపై వదిలేయొద్దని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories