తండ్రి కొడుకుల దారుణ హత్య

తండ్రి కొడుకుల దారుణ హత్య
x
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ పరిధిలోని కృష్ణారావుపల్లెలో భూవివాదం కారణంగా తండ్రీ,కొడుకులను...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ పరిధిలోని కృష్ణారావుపల్లెలో భూవివాదం కారణంగా తండ్రీ,కొడుకులను ప్రత్యర్థులు నరికి చంపారు. గ్రామానికి చెందిన సవనపల్లి యెల్లయ్య అన్న 15ఏళ్ల క్రితం తన వ్యవసాయ భూమిని దేవయ్య, స్వామిలకు విక్రయించాడు. యెల్లయ్య అన్న మరణించిన తర్వాత నుంచి యెల్లయ్య ఆ భూమి తనదేనంటూ దేవయ్య, స్వామిలతో గొడవ పడుతుండేవాడు. గతంలో చాలాసార్లు పంచాయతీలు జరిగి ఆ భూమి మీద కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఎల్లయ్య, అతని కొడుకు శేఖర్ ట్రాక్టర్ తో ఆ భూమిని దున్నుతుండగా విషయం తెలుసుకున్న దేవయ్య, స్వామిలు అక్కడికి చేరుకొని వారితో గొడవపడ్డారు. తండ్రీకొడుకులపై గొడ్డలి, కట్టెలతో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories