logo
ఆంధ్రప్రదేశ్

జగనన్న కాదు.. తాత

జగనన్న కాదు.. తాత
X
Highlights

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి మరోసారి సెటైర్‌ వేశారు. 45ఏళ్లకే...

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి మరోసారి సెటైర్‌ వేశారు. 45ఏళ్లకే ఫించన్‌ ఇస్తానంటున్న జగన్‌ అంకుల్‌, ఆంటీలను వృద్ధులుగా మార్చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ లెక్కన 45ఏళ్లు నిండిన జగన్‌‌ కూడా తాతయ్యే అన్నారు. జగన్‌ పాలసీ ప్రకారం వృద్ధాప్య ఫించన్‌‌కు అర్హుడేనంటూ సోమిరెడ్డి జోకులు పేల్చారు. 45ఏళ్లకే జనాలను వృద్ధులను చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. డిసెంబరు 21న జగన్‌ 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందున ఇక నుంచి ‘జగన్‌ తాత’ అని పిలుపించుకోవాలని మంత్రి సోమిరెడ్డి సూచించారు. జగన్‌, రాహుల్‌ ఏ పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదని ఆదినారాయణరెడ్డి అన్నారు.

Next Story