పాముతో విన్యాసం.. కోపంతో సర్రును కాటేసిన నాగుపాము

x
Highlights

పాము.. పెంచుకున్నదైనా.. పగ బట్టిందైనా.. ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే దాన్ని పాము అంటారు. పాముకి కోరలున్నంత వరకు ప్రాణహాని ఉంటుంది. అయితే అనంతపురంజిల్లా...

పాము.. పెంచుకున్నదైనా.. పగ బట్టిందైనా.. ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే దాన్ని పాము అంటారు. పాముకి కోరలున్నంత వరకు ప్రాణహాని ఉంటుంది. అయితే అనంతపురంజిల్లా చేనేపల్లిలో సుధాకర్‌ అనే వ్యక్తి తను పెంచుకొనే పాముపై అపారమైన ప్రేమ, నమ్మకం. ఆ పాము తనకు తెలిసిందైనా, కొత్తదైనా ఏం చేయదని భరోసా. అదే సుధాకర్‌ కొంప ముంచింది.

చిలమత్తూరు మండలం చేనేపల్లిలో సుబ్రహ్మణ్య షష్టికి విపరీతంగా భక్తులొస్తుంటారు. అలాంటి సమయంలో అక్కడి పుట్టలోంచి పాములు బయటకు రావడం పరిపాటి. అలా బయటకు వచ్చిన విష సర్పాన్ని పట్టుకొని, మెడలో వేసుకొని ఆడించడం సుధాకర్‌ అలవాటు. సుబ్రహ్మణ‌్య షష్టి నాడు పుట్టలోంచి వచ్చే పాము దైవ సర్పమని భక్తుల విశ్వాసం.

అయితే ఈసారి మాత్రం దైవ సర్పం కరుణించలేదు. భక్తితో పట్టుకొన్నా ఆ విషయం తెలియన విషపు నాగు తప్పించుకొని పుట్టలోకి పోవడానికి ప్రయత్నించింది. అయితే సుధాకర్‌ బలవంతంగా తోక పట్టుకొని బయటకు లాగాడు. దీంతో సర్రున కోపమొచ్చిన నాగుబాము కసుస్సుక్కున కాటేసింది. దీంతో సుధాకర్‌ అక్కడే స్పృహ కోల్పోయాడు. దైవ సర్పం కోపానికి గురైన సుధాకర్‌ను చికిత్స కోసం హుటాహుటిన బెంగలూరు తరలించారు.

సుబ్రహ్మణ‌్య షష్టి నాడు పాము పుట్టకి పూజ చేయడం సహజమేనని, అయితే పుట్టలోంచి వచ్చే పాములను పట్టుకొని విన్యాసాలు చేస్తే ఎలా అని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. విషపు నాగుతో సర్కస్‌ చేస్తే ఫలితం ఇలానే ఉంటుందంటున్నారు. ఇకనైనా దైవ నాగులతో విన్యాసాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories