ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. పసికందు అదృశ్యం!

ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. పసికందు అదృశ్యం!
x
Highlights

హైదరాబాద్ కోఠి సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు అదృశ్యమైంది. టీకా ఇప్పిస్తానంటూ...

హైదరాబాద్ కోఠి సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు అదృశ్యమైంది. టీకా ఇప్పిస్తానంటూ తల్లి దగ్గర్నుంచి 6రోజుల చిన్నారిని తీసుకున్న అగంతకురాలు పసికందుతో సహా అక్కడ్నుంచి మాయమైంది. దాంతో చిన్నారి తల్లిదండ్రులు సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకి చెందిన విజయ ప్రసూతి కోసం గత వారం కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో చేరింది. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విజయ కదల్లేని స్థితిలో ఉంది. అది గమనించిన ఓ మహిళ శిశువుకి టీకా ఇప్పిస్తానంటూ చిన్నారితోపాటు మాయమైంది. అయితే ఎంతసేపటికీ మహిళ రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బందికి సమాచారమిచ్చింది. చిన్నారిని మహిళ ఎత్తుకొని వెళ్లిపోయిందని గ్రహించిన తల్లిదండ్రులు సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories