" శివరంజని” సినిమా కలెక్షన్లని శివమేత్తిచ్చింది

" శివరంజని” సినిమా కలెక్షన్లని శివమేత్తిచ్చింది
x
Highlights

అప్పట్లో ఇండస్ట్రీనే ఒక ఆలోచనలో పడేసిన సినిమా మన తెలుగు సినిమా " శివరంజని ". దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 25వ చిత్రం. నిర్మాతగా తారకప్రభు...

అప్పట్లో ఇండస్ట్రీనే ఒక ఆలోచనలో పడేసిన సినిమా మన తెలుగు సినిమా " శివరంజని ". దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 25వ చిత్రం. నిర్మాతగా తారకప్రభు ఫిలింస్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రంగా ప్రాచుర్యం పొందింది. ఈచిత్ర షూటింగ్ 1978 మే 27వ తేదీన తూర్పుగోదావరిజిల్లా పెద్దాపురం మండలం కట్టమూరుగ్రామం రామాలయంలో తొలి షాట్ తీయడంతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి ఈ చిత్ర ముఖ్యకథానాయిక జయసుధ సోదరి సుభాషిణి మరో కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఖమ్మం జిల్లాకు చెందిన హరిప్రసాద్ కథానాయకుడిగా పరిచయమయ్యారు. దాసరి తెలుగులో తీసిన 'స్వర్గం నరకం' చిత్రాన్ని హిందీలో ' స్వర్గ్ నరక్'గా పునర్నిర్మిస్తున్న సమయంలో ఈ చిత్ర కథను సింగిల్ లైన్ ఆర్డర్ గా రాసి అభివృద్ధి చేసుకున్నారు. 'స్వర్గ్ నరక్' చిత్రీకరించేటప్పుడు ఖాళీ సమయంలో తన వద్ద సహాయ దర్శకుడిగా పని చేస్తున్న ధవళ సత్యం తో "శివరంజని" సినిమా సీన్లు వివరిస్తూ అక్కడికక్కడే సినిమా డైలాగులను ఆశువుగా చెబుతూ కేవలం మూడు గంటలలో ఈ చిత్ర సంభాషణలు పూర్తి చేశారు దాసరి. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే 'తాతామనవడు' చిత్రంద్వారా విజయం సాధించిన దాసరి నిర్మాతగా కూడా తొలి ప్రయత్నం లోనే ఈచిత్రంతో విజయం సాధించారు. ఈచిత్రంలోని 'జోరుమీదున్నావె తుమ్మెద నీ జోరెవరికోసమే తుమ్మెద' పాటకు వయోలిన్ ప్లే చేసినవారు ప్రస్తుత ప్రముఖ సంగీతదర్శకుడు మణిశర్మ గారి తండ్రి వై.యన్.శర్మగారు. ఈచిత్రం విడుదలై ఘనవిజయం సాధించి చాలాచోట్ల శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. బెంగుళూర్ కావేరి థియేటర్లో నిర్విరామంగా 52 వారాలు ప్రదర్శించబడిరికార్డు సృష్టించింది తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని చూసి ముచ్చటపడి నటి శ్రీప్రియ తమిళ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని దాసరి దర్శకత్వంలో 'నట్చత్రం' పేరుతో పునర్నిర్మించి 1980 ఏప్రియల్ 12వ తేదీన విడుదల చేయగా అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. రమేష్ నాయుడు ఆణిముత్యాలవంటి స్వరాలు అందించగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రంలోని పాటలు............అభినవ తారవో నా అభిమాన తారవో అభినయ రసమయ కాంతిధారవో - సి.నా.రె....నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతి రేయి కార్తీక పున్నమి రేయి - వేటూరి సుందరరామ్మూర్తి............జోరుమీదున్నావు తుమ్మెద నీ జోరెవరికోసమే తుమ్మెద - సి.నా.రె. తారక ప్రభు ఫిలిమ్స్ పతాకం వచ్చిన సినిమా ఇది. అలాగే ఈ సినిమా ముఖ్య తారాగణం జయసుధ, మోహన్ బాబు, హరిప్రసాద్, సుభాషిణి, నిర్మల, శాంత, అత్తిలి పాప, కుమారి, బేబీ సత్య, తదితరులు నటించారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం దాసరి నారాయణరావు. ఇప్పటివరకు మీరు ఈ సినిమా చూడకుంటే మాత్రం తప్పక చూడవచ్చు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories