హైకోర్టులో సిట్ అధికారులు రిట్ పిటిషన్...దాడి సమయంలో వేసుకున్న చొక్కా అప్పగించాలన్న అధికారులు..

x
Highlights

వైసీపీ అధినేత జగన్ తనపై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై...

వైసీపీ అధినేత జగన్ తనపై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా 8మందిని ప్రతివాదులుగా ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.

మరోవైపు సిట్ అధికారులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో దాడి జరిగిన సమయంలో ప్రతిపక్ష నేత జగన్ వేసుకున్న చొక్కాను అప్పగించాలని ఆ పిటిషన్‌లో సిట్ అధికారులు కోరారు. శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories