సిల్లీ ఫెల్లోసు సీనేంతా?

సిల్లీ ఫెల్లోసు సీనేంతా?
x
Highlights

సిల్లీ ఫెల్లోసు గల్లి కామెడి, నవ్వుల పువ్వులు గారడీ, ఫస్ట్ హాఫ్ నచ్చేనని నానుడి, అల్లిన సన్నివేశాలు అంగడి. శ్రీ.కో. కామెడీ సినిమాల్లో కథ...

సిల్లీ ఫెల్లోసు గల్లి కామెడి,

నవ్వుల పువ్వులు గారడీ,

ఫస్ట్ హాఫ్ నచ్చేనని నానుడి,

అల్లిన సన్నివేశాలు అంగడి. శ్రీ.కో.

కామెడీ సినిమాల్లో కథ కొంతవరకే, అసలు నవ్వుల పువ్వులు విరిసెవన్నీ కథనం మొగ్గల నుండే కదా, సిల్లీ ఫెల్లో దర్శకుడు సిల్లీగా కాకుండా ప్రతి సన్నివేశంలో హాస్యం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇది కొంతవరకు మంచి నవ్వులు పూయించింది. షరా మాములు కథ అయినప్పటికీ, అల్లిన సన్నివేశాలు అల్లుకున్న తీరుబాగుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ ఫ్రెష్ సువాసనని పంచింది. పోలీస్ క్యారెక్టర్ లో బ్రహ్మానందం పండించిన కామెడీ సినిమాకు ఒక పవర్ లాఫ్ తెచ్చింది. కొంచం పాప్కార్న్, కూల్డ్రింక్స్ అయిపోనక వచ్చిన రెండవ బాగమే కొంత ప్రేక్షకుని పేదలకి పరీక్షించే విధంగా ఉన్నది. పోసాని,జయప్రకాష్ రెడ్డి ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఫస్ట్ హాఫ్ లోఒకపాట, సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ మాత్రమే ఉంది. రెండు పాటలు బాగున్నాయి. కామెడీ సినిమాల్లో సదా శుభం కార్డుకు మందు, ఎలా ఉంటుందో ఇందులోనూ అలాగే ఉన్నది, పెద్దగ ఉహించని వాసనలు, సువాసనలు ఏమి లేవు, కానీ మంచి హాస్య తోటలోకి వెళ్లి, నవ్వుల పువ్వుల వాసనా పీల్చి వచ్చినట్టయితే వుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories