ఘంటసాల గారి పాట...

arun
By arun
Updated on: 24 Dec 2018 4:43 PM IST
ఘంటసాల గారి పాట...
X

ఘంటసాల గారు ఒక పాట పాడారు, అంటే అది ఎన్నో దశాబ్దాలు నిలిచిపోతుంది అని అర్ధం. అలంటి పాటే....ఈ శిలలపై శిల్పాలు చెక్కినారు పాట. ఇది 1962లో విడుదలైన మంచి మనసులు చిత్రంలోని పాట. ఈ పాటను ఘంటసాల ఎంతో అద్భుతంగా పాడారు. ఈ పాటకి కె.వి.మహదేవన్ అద్భుతమైన సంగీతం అందించారు. సాహిత్యం అందించింది ఆచార్య ఆత్రేయ.
అహో ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా!
ఈ శిధిలాలలో చిరంజీవి వైనావయా
శిలలపై శిల్పాలు చెక్కినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
కనుచూపు కరువైన వారికైనా
కనుచూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా
శిలలపై శిల్పాలు చెక్కినారు
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు
ఒకప్రక్క ఉరికించు యుద్ధభేరీలు
ఒక చెంత శృంగారమొలుకు నాట్యాలు
నవరసాలొలికించు నగరానికొచ్చాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
ఏకశిలరథముపై లోకేశు వడిలోన
ఓరచూపులదేవి ఊరేగి రాగా
ఏకశిలరథముపై లోకేశు వడిలోన
ఓరచూపులదేవి ఊరేగి రాగా
రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి
సరిగమా పదనిసా స్వరములే పాడగా
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
రాజులె పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు మారినా గాడ్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టిపాల్జేసినా
ఆ... ఆ... ఆ... ఆ...
చెదరనీ కదలనీ శిల్పాల వలెనే
నీవు నా హృదయాన నిత్యమై సత్యమై
నిలిచివుందువు చెలీ
నిజము నా జాబిలీ
ఇప్పటివరకు ఈ పాట మీరు వినకుంటే, ఒక సారి వినండి. శ్రీ.కో.

arun

arun

Next Story