మహిళకు ఎస్సై లైంగిక వేధింపులు...అర్ధరాత్రి సమయంలో...

x
Highlights

కర్నూలు జిల్లాలో ఆత్మకూరు ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి ఓ మహిళ రెండు నెలల క్రితం సారా...

కర్నూలు జిల్లాలో ఆత్మకూరు ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి ఓ మహిళ రెండు నెలల క్రితం సారా కేసులో విచారణ కోసం ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లింది. విచారణ ముగిసిన తర్వాత ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య ఆమె సెల్‌ నంబర్‌ను అడిగి తీసుకున్నారు. అప్పటి నుంచి బాధిత మహిళకు ఫోన్‌లో ఎస్ఐ వేధింపులు ప్రారంభమయ్యాయి.

నువ్వు అందంగా ఉంటావని నువ్వంటే నాకిష్టమని నీ అభిప్రాయం ఏంటో చెప్పాలని అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేస్తున్నాడు ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య. ప్రతి రోజు అర్ధరాత్రి 12గంటల తర్వాత ఫోన్‌లో వేధిస్తుండటంతో బాధితురాలి కొన్ని రోజులు సహించింది. వేధింపుల కాస్తా ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయింది బాధితురాలు. గట్టిగా మందలిస్తే భర్త ఏమైనా అంటాడేమోనని భయంతో తన కుటుంబం బజారున పడుతుందన్న భయంతో అన్ని ఓర్చుకుంది. చివరికి ఎస్‌ఐ వేధింపులకు తట్టుకోలేక జిల్లా ఎస్పీ గోపినాథ్‌ జెట్టీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఉన్నతాధికారులు ఎస్‌ఐని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories