మూడు రూపాయలకే చీర...ఎగబడిన మహిళాలోకం

మూడు రూపాయలకే చీర...ఎగబడిన మహిళాలోకం
x
Highlights

తక్కువ ధరకు చీర దొరుకుతుందంటే చాలు ఎంత దూరమైనా వచ్చి కొనుగోలు చేసే వరకు ఆడాళ్లు ఊరుకోరు. మొన్నటికి మొన్న పది రూపాయలకే చీర అని ప్రకటిస్తే కిలోమీటర్ల...

తక్కువ ధరకు చీర దొరుకుతుందంటే చాలు ఎంత దూరమైనా వచ్చి కొనుగోలు చేసే వరకు ఆడాళ్లు ఊరుకోరు. మొన్నటికి మొన్న పది రూపాయలకే చీర అని ప్రకటిస్తే కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు కట్టిన సీన్‌ ఇంకా మర్చిపోకముందే తాజాగా అదే వరంగల్‌ లో ఓ షోరూమ్‌ ఏకంగా 3 రూపాయలకే చీర అని ప్రకటించింది.

ఇంకేముంది తెల్లారే వరకు షోరూమ్‌ ఓపెన్‌ చేయకముందే క్యూ కట్టారు. వందల సంఖ్యలో వచ్చిన మహిళలు షాపులోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఊహించని రీతిలో జనాలు రావడంతో షోరూమ్‌ యాజమాన్యం చేతులెత్తేసింది. దుకాణాన్ని మూసేసింది. అయినా ఆగని మహిళలు లోనికి వెళ్లేందుకు కుస్తీలు పడ్డారు. ఇటు పోలీసులు వారిని అడ్డుకున్నా ఆగకుండా లోపలికి వెళ్లి చీరను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. మొత్తానికి తీవ్రంగా శ్రమించిన పోలీసులు మహిళలను తిప్పి పంపారు. ఈ సందర్భంగా షోరూమ్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి ఆఫర్లు పెట్టడంపై మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories