చాంతాడంత ఇగోల మూడు ముక్కలాట

చాంతాడంత ఇగోల మూడు ముక్కలాట
x
Highlights

చాంతాడంత ఇగోల పాత్రలు, కమర్షియల్ స్టోరీ వంటలు, వెళ్ళామా, చూసామా చాలు, శివగామిని దాటలేని శైలజారెడ్డి. శ్రీ.కో. కమర్షియల్ కలరింగ్ ఇచ్చే సినిమాలు...

చాంతాడంత ఇగోల పాత్రలు,

కమర్షియల్ స్టోరీ వంటలు,

వెళ్ళామా, చూసామా చాలు,

శివగామిని దాటలేని శైలజారెడ్డి. శ్రీ.కో.

కమర్షియల్ కలరింగ్ ఇచ్చే సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమాలో కొంత సరకు దొరుకుతుంది. మరీ ఎక్కువగా ఆశకి పోకుండా, అలా వెళ్ళామా, చూసామా, వచ్చామా అన్నట్టు వుంటే మాత్రం.. ఈ సినిమాకు వెళ్తే ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్కి ఫుల్ ధంకా బిర్యానీ పెట్టాడు మారుతీ. చాంతాడంత ఇగో ఉండే ముగ్గురు వ్యక్తుల మధ్య ఓ బుల్లోడు ఎలా శాండ్విచ్ అయ్యాడు, అనేది...కథ. ఈ క్రమంలో తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? ఇదో పక్కా కమర్షియల్ స్టోరీ లైన్. పూర్తిగా కథనం మీద ఆధారపడే సినిమా. పాత్రల చిత్రీకరణ, డైలాగులు, నెరేషన్, హాస్యంతోనే వండాల్సిన సినిమా. అయితే ఈ విషయంలో దర్శకుడు మారుతి పూర్తిగా పండించలేకపోయాడు, వడ్డించలేక పోయాడు. ఆకలి మీద వున్నా ప్రేక్షకులకు ఆకలి తీరుతుంది అంతే..రుచుల గురుంచి పట్టించు కోకండి. ఫస్టాఫ్ ఓ మాదిరిగా ఉన్నా సెకండాఫ్ బాగుంటే సినిమా హిట్టయినట్టే. కానీ ఈ సినిమాకు అదే లోపించింది. సెకండాఫ్‌ను మారుతి ఇంకాస్త బలంగా వండితే బాగుండేది. ఇంటర్వల్ తరవాత వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ తప్ప బలమైన సన్నివేశాలు కనిపించవు. తల్లీ కూతుళ్ల మధ్య కోల్డ్ వార్‌ను ఇంకాస్త ఆసక్తికరంగా చూపించి ఉంటే బాగుండేది. శైలజారెడ్డి పాత్రను శివగామిని దృష్టిలో పెట్టుకొని ఎలివేట్ చేస్తే బాగుండేది. అయితే చైతు, అను కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. వీళ్లిద్దరి జోడి తెరపై కొంత రసాలను పండించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories