ప్రయాణికుల‌పై హ‌త్యాచారానికి పాల్ప‌డుతున్న ఓలా క్యాబ్ డ్రైవ‌ర్

ప్రయాణికుల‌పై హ‌త్యాచారానికి పాల్ప‌డుతున్న ఓలా క్యాబ్ డ్రైవ‌ర్
x
Highlights

క్యాబ్‌లో ప్రయాణించే మహిళా ప్రయాణికులపై అత్యాచార యత్నానికి పాల్పడుతోన్న ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్‌ అనే యువకుడు...

క్యాబ్‌లో ప్రయాణించే మహిళా ప్రయాణికులపై అత్యాచార యత్నానికి పాల్పడుతోన్న ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్‌ అనే యువకుడు కొంత కాలంగా వోలా సంస్థలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన క్యాబ్‌లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను మాటలతో మభ్యపెట్టి, ఆపై వాహనం దారి మళ్లించి వారిపై అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 5న కుషాయిగూడలోని ఇదే తరహాలో ఓ యువతిపై అత్యాచార యత్నం చేశాడు. తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిఘా ఉంచిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆదారంగా కారును గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. గతంలో పదేళ్ల బాలికపైన అత్యాచారం, మరికొందరిపై అత్యాచార యత్నం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories