టపాసులు నింపిన విషాదం.. 30మందికి పైగా..

వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు...
వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుందామనుకున్న వారికి అవే టపాసులు ప్రమాదాలకు గురి చేశాయి. టపాసులు పేలడంతో పలు చోట్ల ఇళ్లు దగ్ధమవ్వగా, మరికొన్ని చోట్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్‌లో టపాకాయలు కాలుస్తూ.. ప్రమాదానికి గురైన 30 మంది సరోజిని కంటి ఆసుపత్రిలో చేరారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు.. మరో ఇద్దరికి కంటిచూపు పూర్తిగా పోయే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. మల్కాజిరిగిలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. అనుమతి లేకుండా టపాకాయలు అమ్ముతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లా ఉద్దేమర్రి గ్రామంలో ఇంటి ముందుకు దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదం జరిగింది. పెట్రోల్ అమ్మకాలు సాగించే షాపు కావడంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అటు ఏపీలోనూ దీపావళి సంబారాల్లో కొంతమంది గాయపడ్డారు. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో దీపావళి సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏడు గ్రామాల్లో బాంబులు పేలడంతో ముగ్గురికి చేతి వ్రేలు కట్టవ్వగా… నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు తాటాకు ఇళ్లు మంటలకు ఆహూతి అయ్యాయి. అలాగే కృష్ణా జిల్లా తిరువూరు మండలం అక్కపాలెంలో కూడా టపాసుల దాటికి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో నల్లగర్ల బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోయింది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT