పీసీసీ పనితీరుపై సీనియర్ల ఆగ్రహం...లిస్టులో మరొకరి పేరుపై...

x
Highlights

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈసీ షెడ్యూల్‌ ప్రకటించిన సమయాన తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ముసలం పుట్టింది. పీసీసీ పనితీరుపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి...

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈసీ షెడ్యూల్‌ ప్రకటించిన సమయాన తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ముసలం పుట్టింది. పీసీసీ పనితీరుపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండ హోటల్‌లో నిర్వహించిన ఎన్నికల కమిటీ కీలక మీటింగ్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. అభ్యర్థుల వడపోత కార్యక్రమంలో తమ అసహనాన్ని బహిర్గతం చేశారు కొందరు సీనియర్లు.

ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా కనిపించే కాంగ్రెస్‌లో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి. సీనియర్లు కొందరు పార్టీ తీరుపై, పీసీసీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిటీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. గోల్కొండ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో అభ్యర్థుల ధరఖాస్తులపై వడపోతపై మూడు గంటల పాటు సమావేశమైంది. ఇదే కార్యక్రమంలో సీనియర్లు పీసీసీ పనితీరుపై బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. జహీరాబాద్‌ నియోజకవర్గం అభ్యర్థుల ప్రతిపాదనా లిస్టులో తనతో పాటు మరో పేరు కనిపించడంపై గీతారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇది తనను అవమానించేలా ఉందని పీసీసీ నేతలను నిలదీసినట్లు చెబుతున్నారు.

అలాగే మరో సీనియర్‌ నాయకుడు సర్వే సత్యనారాయణ కూడా పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పబట్టినట్లు తెలుస్తోంది. ఆలంపూర్‌ సభకు తనకు ఆహ్వానం లేదని పీసీసీ పెద్దలను చూసి ప్రజలు ఓట్లు వేయరంటూ బాహటంగానే ఎద్దేవా చేశారు. దీంతో సహచరులు బుజ్జగించడంతో చివరకు సర్వే శాంతించినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు తథ్యం అని డిసెంబర్‌ 12 లేదా 13 న తమ ప్రభుత్వం కొలువుదీరుతుందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధీమా జోస్యం చెప్పారు. అభ్యర్థులు, సీట్ల సర్దుబాట్లపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో నాలుగు ప్రధాన అంశాలపై చర్చ జరిగినట్లు.. సీనియర్‌ లీడర్‌ డీకే అరుణ తెలిపారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయం అని.. చెప్పుకొచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన సందర్భంలో.. మిగతా పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ మాత్రం.. అంతర్గత విభేదాలతో రచ్చకెక్కడం.. చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories