106 సీట్లొస్తే నేను తప్పుకొంటా

106 సీట్లొస్తే నేను తప్పుకొంటా
x
Highlights

సంగారెడ్డి జిల్లాలో TPCC చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సక్సెస్ కావడం స్థానిక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజల్లో అపూర్వ స్పందన...

సంగారెడ్డి జిల్లాలో TPCC చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సక్సెస్ కావడం స్థానిక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజల్లో అపూర్వ స్పందన రావడంతో కాంగ్రెస్ నాయకులు ఉబ్బితబ్బిబవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదనే ధీమా వ్యక్తమైంది. మొదటి విడత TPCC ప్రజాచైతన్య బస్సు యాత్ర సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు సాగింది. సంగారెడ్డితో పాటు జహీరాబాద్, నారాయణ్ ఖేడ్‌లలో జరిగిన యాత్రకు మూడు చోట్లా అపూర్వ స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేట నుంచి సంగారెడ్డి వరకు 5వేల బైకులతో ఘనస్వాగతం పలికారు.

జగ్గారెడ్డిని ఓడించి సంగారెడ్డి ప్రజలు తప్పు చేశారని.. ఆయనలాంటి వ్యక్తి తనకు తోడుంటే అసెంబ్లీలో కేసీఆర్‌ను చెండాడేసేవాళ్లమన్నారు. కేసీఆర్ అబద్ధాల కోరని విమర్శించారు జగ్గారెడ్డి. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐఐటీకి సమీపంలో 10 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ చెప్పినట్టు టీఆర్‌ఎస్ కు 106 సీట్లు వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని, ఒకవేళ టీఆర్‌ఎస్‌ గెలవకపోతే ఆయన రాజకీయాల నుంచి వైదొలగుతారా? అని ఉత్తమ్‌ సవాలు చేశారు. సదాశివపేట మండలం బొబ్బిలిగావ్‌లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతు శ్రీశైలం కుటుంబాన్ని.. ఉత్తమ్ పరామర్శించారు. పార్టీ తరపున ఆయన లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
నారాయణ్ ఖేడ్‌లో బహిరంగసభ అనంతరం బస్సుయాత్ర నిజామాబాద్‌కు తరలి వెళ్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories