Top
logo

మోత్కుపల్లి అలా అంటే మహానాడుకు ఎలా పిలుస్తాం: సండ్ర

మోత్కుపల్లి అలా అంటే మహానాడుకు ఎలా పిలుస్తాం: సండ్ర
X
Highlights

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్ర ఆగ్రహం...

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై నీచమైన ఆరోపణలు చేసిన మోత్కుపల్లిని తెలంగాణ సమాజం చీత్కరించుకుంటుందని అని అన్నారు. దుర్మార్గ పాలన చేస్తున్న కేసీఆర్ ను మోత్కుపల్లి గొప్పవాడు అని ఎలా అంటాడని ప్రశ్నించారు. మహానాడు జరగుతున్న సమయంలో టీడీపీపై మోత్కుపల్లి విషం కక్కుతున్నారని సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. టీడీపీ, చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత మోత్కుపల్లికి లేదన్నారు. గవర్నర్‌ పదవి కోసం బీజేపీ నేతల దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించలేదా అని ప్రశ్నించారు.

గవర్నర్‌ పదవి..బీజేపీ ఇవ్వకపోతే చంద్రబాబు ఏం చేస్తారని అన్నారు. పవన్‌, జగన్‌ను పొగుడుతున్న మోత్కుపల్లిని ఎవరు ఆడిస్తున్నారో తెలుసని సండ్ర తెలిపారు. మహానాడు సమయంలో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సస్పెండ్ అవసరం లేదని..మోత్కుపల్లి రాజకీయ జీవితం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లిని మహానాడుకు ఎలా పిలుస్తామని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.

Next Story