ఉత్తరాదిని కుదిపేస్తున్న ఇసుక తుఫాను

ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని ఓ వైపు మంచు తుపాన్లు వణికిస్తుంటే .. మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫానులు...
ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని ఓ వైపు మంచు తుపాన్లు వణికిస్తుంటే .. మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫానులు వణికిస్తున్నాయి. రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీలను ఇసుకు తుఫాను కుదిపేసింది. పెనుగాలుల ధాటికి హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పులు లేచిపోగా.. రహదారులు జలమయమయ్యాయి. హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో సాయంత్రం కాగానే రోడ్లు నిర్మానుషంగా మారుతున్నాయి. గాలులు ప్రారంభం కాగానే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు సూచించింది. ఇసుక తుఫానుల కారణంగా ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 134 మంది మృతిచెందినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
ఇసుక తుపానుల ప్రభావం మరో 24 గంటలు ఉండొచ్చని వాతావరణశాఖ ప్రకటించింది. గంటకు 70 కిమీవేగంతో ఈదురు గాలులు ఉండొచ్చని హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలులు వీస్తున్న సమయంలో తీసు్కోవలసిన జాగ్రత్తలను సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వ, ప్రయివేటు ప్రసార సాధానాల ద్వారా వివరిస్తున్నారు. ఇప్పటికే అధికారుల సెలవులను రద్దు చేసిన పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు తక్షణమే విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేశాయి.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT