సామ్రాట్‌ కి డ్రగ్స్‌, హుక్కా అటవాట్లున్నాయి.. వుమనైజర్‌ కూడా

సామ్రాట్‌ కి డ్రగ్స్‌, హుక్కా అటవాట్లున్నాయి.. వుమనైజర్‌ కూడా
x
Highlights

టాలీవుడ్‌ యువ నటుడు సామ్రాట్‌ రెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. దొంగతనం కేసులో మాదాపూర్ పోలీసులు సామ్రాట్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. తన భర్త సామ్రాట్‌...

టాలీవుడ్‌ యువ నటుడు సామ్రాట్‌ రెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. దొంగతనం కేసులో మాదాపూర్ పోలీసులు సామ్రాట్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. తన భర్త సామ్రాట్‌ కి డ్రగ్స్ కి అలవాటు పడి వేదింపులకి గురిచేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది భార్య హర్షిత రెడ్డి. పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకురావాలని మానసిక క్షోభకు గురిచేశాడని హర్షిత తెలిపింది. పార్టీలకు వెళ్లిన సమయంలో తనతో బలవంతంగా హుక్కా తాగించే వాడని ఆరోపిస్తుంది.

సామ్రాట్‌ రెడ్డి... తాము ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడని, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారంటూ భార్య హర్షిత రెడ్డి మాదాపూర్ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హీరో సామ్రాట్‌ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. అయితే గత ఏడాది నవంబర్ లో తనని అదనపు కట్నం తీసుకురావాలని వేదనకు గురిచేస్తున్నాడని రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది భార్య హర్షిత రెడ్డి. అయితే అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతికి హర్షిత తన పుట్టింటికి వెళ్లిన సమయంలో సామ్రాట్‌ ఇంటికి వచ్చి తాళాలు పగులకొట్టాడని, ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లాడని భార్య హర్షిత చెబుతుంది.

తనని పెళ్లి చేసుకునే ముందు తానూ సినిమాలు మానేస్తానని చెప్పి, పెళ్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తున్నాడు అని ఆరోపించింది హర్షిత. సామ్రాట్‌ ఫ్రీ లైఫ్‌కి అలవాటుపడి తనని వేధించేవాడని తెలిపింది. డ్రగ్స్‌, హుక్కాకి అలవాటు పడ్డాడని, పార్టీల్లో డ్రగ్స్ ను తీసుకోనేవాడని చెబుతుంది. అంతే కాదు సామ్రాట్ పెద్ద విమెనైజర్‌ అని‌. పార్టీల్లో తన పక్కన కూర్చునే వేరే అమ్మాయిలను ఫ్లర్ట్‌ చేసేవాడని హర్షిత అంటోంది. ఈ విషయాలపై నిలదీస్తే తనపై దాడి చేసేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక హర్షిత పేరుమీదున్న ఆస్తులు రాసివ్వకుంటే బ్రేకప్‌ చెప్తానని సామ్రాట్‌ బెదిరించేవాడని ఆమె తండ్రి కృష్ణా రెడ్డి ఆరోపిస్తున్నారు. తమకి న్యాయం కావాలని, తన కూతురు భవిష్యత్‌ను రోడ్డుపై పడేసిన సామ్రాట్‌పై చర్యలు తీసుకోవాలని హర్షిత తండ్రి కోరుతున్నారు.

మరోవైపు భార్య వర్షిత, అత్తమామలు చేస్తున్న ఆరోపణలపై హీరో సామ్రాట్‌ కూడా స్పందించాడు. హర్షిత చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం దొంగలించానని ఆరోపిస్తుందని, కానీ నా ఇంట్లో నాకు కావలిసిన వస్తువులు తీసుకెళ్లానని చెప్తున్నాడు హీరో. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశానే తప్ప, తనకెలాంటి చెడు అలవాటు లేదన్నాడు సామ్రాట్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories