70 ఏళ్ల బామ్మ పాత్రలో సమంత

nanireddy
Updated on: 28 Dec 2018 12:17 PM IST
70 ఏళ్ల బామ్మ పాత్రలో సమంత
X

పెళ్లయినా హీరోయిన్ గా కొనసాగడం సినీ ఇండస్ట్రీలో కొంచెం కష్టమే.. అయితే అది టాప్ హీరోయిన్ గా అంటే మరింత కష్టం. కానీ టాలీవుడ్ అగ్రనటి అక్కినేని సమంత మాత్రం తన స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంది. ఇటీవల వరుస హిట్లతో మాంచి జోరుమీదున్న సమంత ఈ ఏడాది నాలుగు సూపర్‌ డూపర్ హిట్స్‌ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ వారం కిందటే పూర్తయింది. ఏ పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే ఈ అమ్మడు.. ఇందులో 70 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనున్నారు. సమంత తనయుడిగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. బామ్మ పాత్రకోసం పూర్తిస్థాయి ప్రోస్థెటిక్‌ మేకప్‌ను ఉపయోగిస్తున్నారట. ఈ చిత్రానికి ‘ఓ బేబీ– ఎంత సక్కగున్నవే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సినీ వర్గాల సమాచారం.

nanireddy

nanireddy

Next Story