కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ ఖాన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం..కాసేపట్లో శిక్ష ఖరారు

కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ ఖాన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం..కాసేపట్లో శిక్ష ఖరారు
x
Highlights

1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్ పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషేనని...

1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్ పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషేనని న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని పేర్కొన్న న్యాయమూర్తి, సల్మాన్ కు మరికాసేపట్లో శిక్షను ఖరారు చేయనున్నారు. జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని చెప్పారు. కాగా, కేసు విచారణ సుదీర్ఘంగా సాగిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ దోషిగా తేలడంతో, శిక్ష పడ్డ వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు, అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించగా, వెంటనే పై కోర్టుకు అపీలు చేసుకునే నిమిత్తం శిక్షను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసేందుకు సల్మాన్ తరపు న్యాయవాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories