అవును ప్రేమలో ఉన్నా.. సాయిపల్లవి

అవును ప్రేమలో ఉన్నా.. సాయిపల్లవి
x
Highlights

తన ఫస్ట్ సినిమాతోనే యూత్ ని ఆకట్టుకున్న బ్యూటీ సాయిపల్లవి. ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఆమె నటన చాలా నాచురల్ గా అనిపిస్తోందని అంటున్నారు. మేకప్ అంతగా‌...

తన ఫస్ట్ సినిమాతోనే యూత్ ని ఆకట్టుకున్న బ్యూటీ సాయిపల్లవి. ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఆమె నటన చాలా నాచురల్ గా అనిపిస్తోందని అంటున్నారు. మేకప్ అంతగా‌ వేయని ముఖం, నిండుగా దుస్తులు.. చూడటానికి ముచ్చటగా కనిపించే సాయిపల్లవి. ఎంతో మంది కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకుంది. ఎక్కువగా లవ్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. నిజజీవితంలో కూడా లవ్ లో పడింది. అయితే అది అబ్బాయి ప్రేమలో కాదులెండి.. ప్రేమలో పడటం, సహజీవనం చెయ్యడం వంటివి చెయ్యనని చెబుతోంది. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన పడి పడి లేచే మనసు సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ రెండు విషయాలపై సాయిపల్లవి మాట్లాడింది. అబ్బాయిలు చూస్తున్నారంటే నాకు సంతోషంగా అనిపించేది. కాలేజ్‌ డేస్‌లో ప్రేమలో పడే టైమ్‌లేదు. పుస్తకాలతో ప్రేమలో పడిపోయా. ఇప్పుడు నా ప్రేమ సినిమాలతోనే. అవును.. సినిమాలతో ప్రేమలో ఉన్నా. పెళ్లి చేసుకుంటా.. కానీ నిజ జీవితంలో సహజీవనం మాత్రం చేయాలనుకోవడం లేదు. అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories