అమ్మ కోసం మనసు మార్చుకున్న సాయిపల్లవి

lakshman
Updated on: 24 Dec 2018 1:06 PM IST
అమ్మ కోసం మనసు మార్చుకున్న సాయిపల్లవి
X


సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై తల్లి ప్రభావం ఉండడం మామూలు విషయమే. ఫిదాతో తెలుగు సినీ ప్రేక్షకులను మాయ చేసి పారేసిన యంగ్ బ్యూటీ సాయి పల్లవి విషయంలోనూ ఇది సహజమే అని ప్రూవ్ అయ్యింది. తెలుగులో వరుస సక్సెస్ లు అందుకుంటున్న సాయిపల్లవి.. తమిళ్ లోనూ మంచి డెబ్యూ కోసం ఎదురుచూసింది. అదే సమయంలో కరు పేరుతో ఓ కథను దర్శకుడు విజయ్ సాయి పల్లవికి వినిపించాడట. అందులో.. మన తెలుగు హీరో నాగశౌర్య కథనాయకుడు.

కథ తనకు నచ్చకపోవడంతో.. ముందు ఈ సినిమా చేయనని తెగేసి చెప్పిందట. కానీ.. సాయిపల్లవి చేస్తేనే బాగుంటుందని నమ్మకంగా ఉన్న దర్శకుడు విజయ్.. ఆమె తల్లిని కలిసి కథ వినిపించాడట. వినగానే ఇంప్రెస్ అయిన ఆమె.. ఇలాంటి కథ మళ్లీ మళ్లీ దొరకదు అని తన కూతురిని కన్విన్స్ చేసి ఒప్పించిందట.

అలా.. అమ్మ కోసం ఈ సినిమా ఒప్పుకున్నానని ఫిదా బ్యూటీ చెబుతోంది. కానీ.. సినిమా మాత్రం బాగానే వచ్చిందని చెబుతోంది. విజయంపై కూడా నమ్మకం ఉందంది.

lakshman

lakshman

Next Story