హీరోయిన్‌కు గాయాలు

nanireddy
Updated on: 28 Dec 2018 12:13 PM IST
హీరోయిన్‌కు గాయాలు
X

సుప్రీం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన 'కబాలి' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ధన్సిక. తొలి సినిమాతోనే బహుభాషా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ధన్సిక తెలుగులో వాలు జడ, తమిళ్‌లో యోగి డా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే శనివారం ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ధన్సిక కంటి కింద గాయాలయ్యాయి.

ఓ బార్‌లో యాక్షన్ సీన్‌ చిత్రీకరన జరుగుతోంది.ఈ క్రమంలో బీర్ బాటిల్స్ రౌడీలు పైకి విసిరేసి సన్నివేశం చిత్ర్రీకారణ జరుగుతోంది. కొంత మంది రౌడీలు బాటిళ్లను విసిరేశారు.. దాంతో పగిలిన గాజు ముక్క ఒకటి ధన్సిక కంటి కింది భాగంలో గుచ్చుకుంది. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ధన్సిక కోలుకున్నట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story