భార్య బ్రతికుండగానే పెద్దకర్మ...ఏకంగా భార్యకే పెద్దకర్మ కార్డు పంపిన భర్త

x
Highlights

భార్య బ్రతికి ఉండగానే పెద్ద కర్మకు రావాలని ఆమెకే కార్డ్ పంపాడు ఓ ప్రబుద్ధుడు. తన భార్య పెద్ద కర్మకు రావాలని ఏకంగా 400 మంది బంధు, మిత్రులకు పంచాడు....

భార్య బ్రతికి ఉండగానే పెద్ద కర్మకు రావాలని ఆమెకే కార్డ్ పంపాడు ఓ ప్రబుద్ధుడు. తన భార్య పెద్ద కర్మకు రావాలని ఏకంగా 400 మంది బంధు, మిత్రులకు పంచాడు. భర్త నిర్వాకంతో భార్య ఖంగుతింది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం నల్లబెల్లి శివారు కొత్తపెళ్ళికి చెందిన సుమతికి అల్లీపూర్ కు చెందిన చందర్ రావుతో 2015లో పెళ్లి జరిగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసైన భర్త.. భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం పిల్లలను తీసకుని భార్య పుట్టింటికి వెళ్లింది. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి సుమతికి పెద్ద కర్మ కార్డు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ కార్డు చూసి సుమతి షాక్ తింది. తన భార్య సుమతి చనిపోయిందని, పెద్ద కర్మకు రావాలని చందర్ రావు కోరారు. తన భర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ బాధితురాలు, ఆమె తల్లి వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories