పవన్ సమావేశంలో తోపులాట.. నలుగురికి తీవ్ర గాయాలు

X
Highlights
జనసేన అధినేత పవన్ కల్యాణ్...అనంతపురం పర్యటనలో భాగంగా హిందూపురంలో పర్యటించారు. హిందూపురంలో నిర్వహించిన...
arun29 Jan 2018 11:24 AM GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్...అనంతపురం పర్యటనలో భాగంగా హిందూపురంలో పర్యటించారు. హిందూపురంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తోపులాట జరగడంతో...నలుగురికి గాయాలయ్యాయ్. క్షతగాత్రులకు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జయచంద్ర, నరసింహా మూర్తి, మంజునాథ్ తదితరులకి గాయాలయ్యాయి. వీరిలో జయచంద్ర పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. ఇలా సమావేశం అర్ధంతరంగా రసాభాసగా మారడంతో మధ్యలోనే ముగించి పవన్ వెళ్లిపోయారు. కాగా, తీవ్రంగా గాయపడిన జయచంద్రను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్టు సమాచారం.
Next Story