సమ్మె సైరన్‌ సరే, ఆర్టీసీ గత ఫిట్మెంట్‌ మరిచిపోయిందా?

సమ్మె సైరన్‌ సరే, ఆర్టీసీ గత ఫిట్మెంట్‌ మరిచిపోయిందా?
x
Highlights

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు..ఒకే తాటిపైకి వచ్చారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల వేతన సవరణ కోసం టీఎంయూ సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతో...

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు..ఒకే తాటిపైకి వచ్చారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల వేతన సవరణ కోసం టీఎంయూ సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తామన్న సర్కార్‌...తర్వాత మాట తప్పింది. దీంతో ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు రెడీ అవుతున్నారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు...సమస్య సాధన కోసం ఏకమయ్యారు. యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినా....ఏలాంటి స్పందన లేకపోవడంతో టీఎంయూ సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది. అధికార పక్షానికి అనుబంధంగా పనిచేస్తున్న టీఎంయూ....సమ్మెకు పిలుపునివ్వడంతో సీఎం కేసీఆర్‌...కార్మిక సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘంతో సమస్య పరిష్కారం కాదని భావించిన ఇతర కార్మిక సంఘాల నేతలు....సమ్మె వైపు మొగ్గు చూపారు. దీంతో టీఎంయూ నేతలు...కలిసి పని చేద్దామంటూ ఇతర యూనియన్‌ నేతలకు లేఖలు రాశారు.

ఆర్టీసిలో వేతన సవరణ గడువు ముగిసి ఏడాది పూర్తయింది. గతేడాది ఏప్రిల్‌‌లో కొత్త పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ దిశగా ప్రయత్నాలు జరగలేదు. పే రివిజన్ కమిటీ వేసినప్పటికీ...స్పష్టత రాలేదు. 14 నెలలుగా వేతన సవరణలో జాప్యం కారణంగా కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆర్టీసిలో గుర్తింపు కార్మిక సంఘమైన టిఎంయూ ఛలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టింది. మరో వైపు ఆర్టీసిలో ఇతర కార్మిక సంఘాలు జెఎసి ఏర్పాటు చేసి పోరాటాలకు దిగడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఓ వైపు ప్రభుత్వం నుంచి మంత్రి వర్గ ఉపసంఘంతో భేటీ అయినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో సమ్మె ఒకటే పరిష్కారమని భావించి సమ్మెకు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు..కార్మికుల ఆశలపై నీళ్లు చల్లాయ్. ఆర్టీసీకి నష్టాలే లేవని...నష్టాలపై ఎలాంటి చర్చలకైనా సిద్ధమని సీఎం కేసీఆర్‌‌కు సవాల్‌ విసిరారు. ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత 60డిపోలకు నష్టాలే లేవని...ఇదే విషయాన్ని రవాణాశాఖ మంత్రి పలు సందర్భాల్లో చెప్పారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసీ నష్టాలకు డీజిల్‌ భారమే ప్రధాన కారణమంటున్నారు. ఏటా 20కోట్ల లీటర్ల డీజిల్‌ విపియోగిస్తోందని.... ధరలు పెరిగినప్పుడల్లా ఆ భారం ఆర్టీసీపైనే పడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత... డీజిల్‌ ధర 18 రూపాయలు పెరిగిందని...ఈ భారమే ఆర్టీసీపైన పడిందంటున్నారు. ఆర్టీసీ కార్మికులు రోజుకు 12 కోట్ల రూపాయలు ఆదాయం తెస్తున్నారని...ఇందులో ప్రభుత్వానికి పన్నుల కోసం కోటిన్నర రూపాయలు చెల్లిస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. పన్నుల దోచుకోవడం ఆపితే సంస్థకు నష్టాలే ఉండవంటున్నారు. కార్మికులు వేతనాలు అడిగితే ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని వాపోతున్నారు. మంత్రివర్గ ఉప సంఘం ఏటూ తేల్చకపోవడం...సీఎం కేసీఆర్‌ ఆగ్రహించడంతో పది యూనియన్లతో కూడిన జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories