వైఎస్‌ జగన్‌కి ఏమైనా జరిగితే ఊరుకోం : రోజా

x
Highlights

విశాఖ విమానాశ్రయంలోని విజిటర్స్ లాంజ్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో పని చేస్తున్న...

విశాఖ విమానాశ్రయంలోని విజిటర్స్ లాంజ్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో పని చేస్తున్న శ్రీనివాస్ అనే వెయిటర్ కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...జగన్ గొంతు కోయడానికే ప్రయత్నం జరిగిందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఫోర్క్‌తో పొడిచారని కొన్ని మీడియాల్లో రాస్తున్నారని, దీన్నొక చిన్న విషయంగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందని చెప్పుకొచ్చారు. మాకేం సంబంధం అని ప్రభుత్వం తప్పించుకోజూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇదొక లాఅండ్ ఆర్డర్ సమస్యేనని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం క్యాండిల్ ర్యాలీ చేయడానికి గతంలో విశాఖ వెళ్ళినప్పుడు కూడా జగన్‌కి ఇటువంటి అవమానం జరిగిందని, రన్వే మీదే నిలిపివేశారని రోజా గుర్తు చేస్తోంది. జగన్ కు ఏమైనా అయితే ఊరుకోబోమని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories