logo
ఆంధ్రప్రదేశ్

సంచలనం సృష్టించిన గుంటూరు చోరీని ఛేదించిన పోలీసు

సంచలనం సృష్టించిన గుంటూరు చోరీని ఛేదించిన పోలీసు
X
Highlights

గుంటూరులో సంచలనం సృష్టించిన చోరీ కేసును.. పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో.....

గుంటూరులో సంచలనం సృష్టించిన చోరీ కేసును.. పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో.. పట్టపగలే కోటికి పైగా నగదుతో ఉడాయించిన దుండగులను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దగ్గరి బంధువుల పనే అని తేల్చారు. నిన్న ఉదయం 11 గంటల 30 నిముషాల సమయంలో.. మేకా వేమారెడ్డి ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి.. అడ్రస్ అడుతుతూ.. ఇంట్లోని వారిపై దాడి చేశారు. బీరువాలో ఉన్న కోటికి పైగా నగదుతో పాటు.. 20 సవర్ల బంగారాన్ని అపహరించుకుపోయారు. రాజధానితో పాటు.. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఘటన జరగడంతో.. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తమకున్న పొలాన్ని అమ్మడంతో వచ్చిన సొమ్మును రెండు బ్యాగుల్లో అమర్చామని.. అందులో ఒక బ్యాగును దొంగలు ఎత్తుకుపోయారని.. కోటికి పైగా నగదు దొంగలించారని.. బాధితులు తెలిపారు. అయితే, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. దోపిడీకి పాల్పడ్డ దొంగల్ని అదుపులోకి తీసుకుని వాళ్లనుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకుని దుండగుల్ని అరెస్ట్ చేశారు.

Next Story